మార్పు – షేక్ అల్లాబక్షు

హాచ్…హాచ్ .
పక్కల్లో ఆటంబాబు పడ్డట్లు ఉల్లిక్కి పడ్డాడు అనుమానాలరావు కాదు.ఆనందరావు . ముఖానికి ఉ న్న మాస్కుని సరిచేసుకొని కోపంగా ఎదురుగా ఉన్న మనిషిపై విరుచు కు పడాలని నోరు తెరవబోయాడు. ఉగ్రనరసింహంలా ఉన్న తన బాస్ గురుమూర్తిని చూసి ఉలిక్కి పడ్డాడు. ఎం క్లాసు పీకుతాడో..అనుకుంటునే కూర్చిలో నుంచి లేచి నిలబడ్డాడు.

ఏవయ్యా మా పాప పట్టినరోజుకు స్వీట్లు తెచ్చి ఇవ్వబోతే అక్కడి పెట్టి వెళ్లమన్నావంటా. చేత్తో తీసుకోకపోతే సరి. వాటిని తినకుండా చెత్త కుప్పలో పడవేశావంటా. ఎం ఎలా కనబడతున్నాం నీ కంటికి’.. అనందరావుకు సమాధానం చెప్పకొనే అవకాశం కూడా ఇవ్వకుండా పావుగంట

http://www.dreamstime.com/stock-photo-boss-apprehensive-clerk-image11446770

క్లాసు పీకి తన ఛాంబర్లోకి వెళ్లిపోయాడు.
ఇదంతా రొటినే …అనుకుంటూ ఆఫీసులో ఎవరిపనివారు చేసుకుపోతున్నారు.
మనసులోనే రగలిపోతున్నాడు అనందరావు’ ఆరోగ్యంగా ఉండాలనుకోవటం తప్పా..ఏమిటో ఈ మనుషుల మనస్తత్వం అర్ధంకాదు. వారు ఆరోగ్యనియమాలు పాటించరు. తాను పాటిస్తే ఒర్చుకోరు. అనుకుంటూ డెటాల్తో చేతులు కడుక్కోవటానికి వాష్బేషన్ వద్దకు చేరుకున్నాడు.
* * * * *
ఆనందరావు ఎలియాస్ అనుమానాలరావుకు చిన్నతనం నుంచి పరిశుభంగా ఉండాలని తపన పడేవాడు. అది ఎంత ఇష్టమంటే రోజుకు 30 సార్లు చేతులు కడుక్కొనేంత. ప్రైవేటు చిట్ఫండ్ కంపెనిలో అకౌంటెంట్గా పని చేరిన కొన్ని రోజుల్లోనే అనందరావు పేరు కాస్త అనుమానాలరావుగా మారిపోయింది. మొదట్లో ఆఫీసులో అటెండర్ నుంచి పై స్థాయి సిబ్బంది వరకు వింత జంతువుగా చూసేవారు. తరువాత వారే అలవాటు పడ్డారు. ఎవరైనా షేక్హ్యాండ్ కోసం చేతులు చాస్తే వారికి వినయంగా నమస్కరించేవాడు. ఎవరైనా పార్టీలు, వివాహాది శుభకార్యాలకు పిలిచినా పచ్చి
మంచినీరు ముట్టేవాడుకాదు. మర్యాద కోసం అలా కనబడివచ్చేవాడు. చిన్నతనంలోనే అమ్మా, నాన్న రోడ్డు పమ్రాదంలో చనిపోతే వచ్చిన ఇన్స్రెన్సూ డబ్బులు జాగత్ర చేసి, ఉన్న పొలం అమ్మి బామ్మే పెంచి పెద్ద చేసింది. ఆనందరావు అలవాట్లు తెలిసి బయట నుంచి పెళ్లి సంబంధాలు రాలేదు. బామ్మా ఎన్నోసార్లు చెప్పిచూసింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఒకటి ఆరా సంబంధాలు వచ్చినా ఇతని వాలకం చూసి అట్టే పరాయయ్యే వారు. బామ్మ పోరుపడలేక మేనమామే కట్నం ఇవ్వననే షరతుతో మూడేళ్ల కిత్రం తన కూతురు కళ్యాణి ని ఇచ్చి పెళ్లిచేశాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు కధ. ఐదో తరగతి వరకే చదువుకున్న కళ్యాణి మనస్తత్వం పూర్తి వ్యతిరేకం. దీంతో పత్రి రోజు ఆ ఇంట్లో జరి గే వివాదాలు చుట్టుపక్కల వారికి పైసా ఖర్చులేని వినోదాన్ని
అందిస్తుంటాయి.
ఆ రోజు ఆనందరావు జీవితంలో పెనుమార్పుకు నాంది పలకబోతుంది. తాను ఇంటికి వచ్చే సరికి అంతా ప్రశాంతంగా ఉంది. బయట అరుగుమీద కూర్చొని అమ్మలక్కలతో కబూర్లు చెప్పె బామ్మ జాడలేదు. ఎప్పటిలాగే రెండుమూడుసార్లు కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగుపెట్టేసరికి భార్యమణి పడకగది దుప్పటి ముసుగుతన్ని పడుకొని ఉంది. ముసుగుతీసి వంటిపై చేస్తే వెచ్చటి
ఆవిరు వస్తున్నాయి. భర్త రాకను గమనించి మంచంపై లేచి కూర్చొవబోయింది. వద్దని వారించాడు.
‘వచ్చావా…? చిన్న జ్వరమే సరుకుంటుంది. అమ్మాయికి మందులు తెర్దామని బయట కు వచ్చా. .అప్పడే వచ్చిన బామ్మ టాబ్లెట్లు అందించింది.
హాచ్.హాచ్ వరుసగా కళ్యాణికి వచ్చిన విని తుమ్మలు. అదిరిపడ్డాడు. మంచానికి దూరంగా
జరిగాడు. మనవుడి వాలకం చూసి తమాయించుకోకపోయింది బామ్మ,
‘నీ చాదస్తం తగలద.మనిషి అన్నాక రోగాలు రాకపోతాయా.తగ్గకపోతాయా. జలుబు చేసి తుమ్ములు వస్తే అమ్మాయికి అంతదూరం వెళ్లావెంట్రా చచ్చినోడా…దండకం మొదలు పెట్టింది.
ఈ మాటలేవి ఆనందరావుకు నినబడటం లేదు. గదిలో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. తన భార్యకు వచ్చిన జబ్బు విషజ్వరమే. మునిసిపాలిటి వారు వీధులు బాగుచేయమంటే లెక్కచేయటం లేదు. మొన్నటి మెన్న తమ వీధి చివర్లో ఉండే పాపారావు కూడా ఇలాంటి లక్షణాలతో చచ్చిపోయాడు. వాడి చచ్చిపోయాక పట్టించుకోకపోవటం వల్ల ఆ ఇంట్లో నలుగురు ఆసుపత్రిలో చేరారు. అమ్మో ఆలశ్యం చేస్తే ఇంకామైనా ఉండా .గాలిలోనే ఈ విషజ్వరం వస్తుందంటా .లక్షణాలు చూస్తే పాపారావుకు వచ్చి జబ్బులాగే ఉంది. ”
ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ‘బామ్మా. కళ్యాణిని రెడిచేయి అంబులెన్స్ ను పిలుసుకొని వస్తా…’ బిక్కచచ్చిపోయారు బామ్మ, కళ్యాణి.
అంతజ్వరంలోనూ ‘ మీకే మన్నా పిచ్చిపట్టిందా…చిన్న జ్వరానికే ఆసుపత్రి అంటూరు.అంబులెన్సు అంటారు. ‘వారించే ప్రయత్నం చేసింది. ఈ మద్య భర్త ప్రవర్తన తీవంగా ఉంటుంది. పక్కంటి పిన్నిగారు చెప్పారు ఇది కూడా ఒకరకమైన పిచ్చేనంటా.
ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. అన్నంత పని చేశాడు ఆనందరావు అంబెలెన్స్లో పట్టణంలోని ఓ పెద్ద కార్పోరేట్ ఆసుపత్రికి చేర్పించాడు.
అక్కడి నుంచే అసలు కష్టాలు మొదలయ్యాయి.వారం రోజులు ఆసుపతిలో ఉంచారు. ముందుగా స్వైన్పల్లా అని, కాదు మరో జబ్బుఅని అన్ని పరీక్షలు చేశారు. ఉదయం ఆసుపతిక్రి వెళ్లటం భార్యను పరామర్శించటం, బామ్మను సహాయంగా పెట్టడం వారికి కావలిసినవి తెచ్చిపెట్టడం దినచర్యలో భాగంగా మారాయి. తన కూతరు ఆసుపత్రిలో ఉందని అత్తమామలు, చెల్లెల్ని పరామర్శించటానికి వచ్చిన బామ్మర్ధి అతని బంధువులు ఇలా నెలకు సరిపడ ఇంట్లో ఉన్న వెచ్చాలు రెండు రోజుల్లోనే ఖాళీ అయ్యాయి. ఇలా తిరిగి తానే పేషంటుగా మారిపోయాడు.
మొత్తానికి నానా హడావిడి చేసి ఆసుపతిలో పెద్దడాక్టర్ చావుకబురు చల్లగా చెప్పాడు. కళ్యాణికి వచ్చింది సామాన్య జ్వరమేనని ఆమెకు ఎటువంటి అనార్యోగం లేదుని. వారం రోజుల్లో రెండు లక్షలు ఆసుపతి ఖర్చులు, బంధువులకు వెచ్చించిన తరువాత గాని అనందరావుకు జ్ఞానోదయం కలగలేదు. ఆసుపతి ఖర్చు, ఇంట్లో బంధువులకు ఖర్చుకు ఉన్న ఇంటిని తాకట్టుపెట్టాడు..ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్తున్నాడు. ఇప్పడు ఆనందరావు అనుమానాలరావు లా
కాదు. కళ్యాణికి ఆనందంగా ఉంది. తనకు వచ్చిన జ్వరం భర్తలో ఇంత మార్పు తెస్తుందని ఊహించలేదు ఆమె.

Share This Post

5 Comments - Write a Comment

  1. సాయి వెంకటేష్ కొర్లాం · Edit

    చక్కని సందేశాత్మక కథ అందించారు.
    ధన్యవాదాలు…

    Reply

Leave a Reply