గమ్యం – M.R.D. రామ్

కంటి నీడలుజీవితాలు
కనుపాపలు గమ్యాలు
గమ్యాన్నిచేరాలంటే
కనుపాపల గీతలు
abstract-art-somebodys-smilingమన తలరాతలు బావుండాలి
అలా అని అనుకుంటే సరిపోదు
వాటి రాతను మనం మార్చగలగాలి
చేతి రాతను తిరగరాయాలి
అలా చేస్తే
మీ
జీవితాలకు
చెరువు గట్టులా
పంట చేనులా
తిరుణాల సందడిలా
కను పాపలకు నేస్తంలా
మారుతుంది జీవితం
మరి …..
ఆ మార్పు ఓర్పు నీలోన దాగి ఉన్న విషయం
తెలుసుకున్నవా?
ఐతే రా… రా… 
నాతో చేయీ కలుపు
నీ విజయ గీతను
 ప్రపంచానికితెలియ జేయ్
ఎందుకాలస్యం
ఆ చందమామ నవ్వుతాడనా?
అమావాస్య వస్తే దాక్కున్న ఆయనకేం తెలుసు
నీ చేతి వెలుగును
సూర్యుడు వెక్కిరిస్తాడనా?
రాహువు కేతువులకు భయపడే వెలుగుకేం తెలుసు! 
నీ మాటలోని చైతన్యం
నిన్ను తెలుసుకునే వారికి తెలుపు
నీ యుక్తి బలీయత
విశ్వానికే గమ్యాన్ని తెలుపు!

DURGA
M.R.D. రామ్ 8500624217

Share This Post

Leave a Reply