ఆయన మరణం ఒక విప్లవం – బండారు సురేష్ బాబు(బసు)

ఆయన జననం ఒక ప్రమాదమైతే

ఆయన మరణం ఒక విప్లవం

అవును…

తన జననాన్ని ప్రమాదంగా సిద్దాంతీకరించిన వాడు

తన మరణాన్ని విప్లవీకరించాడు 

జననం ఆయన చేతుల్లో లేదు కాబట్టి

మరణాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు 

అందరు అంటుంటారు. ..

maxresdefault rohithమరణం మన చేతుల్లో ఉండదని

ఆ భయంతోనే జీవితాంతం భయభయంగా ..

పిరికివాళ్లల్లా బ్రతుకీడుస్తారు

బాల్యం నుంచి బ్రతుకే పోరాటమై

బ్రతుకుతున్న ఏకలవ్యశిష్యుడికి

భయానికి అర్ధం తెలియదు

అధ్యయనం..పోరాటమే.. 

ఉచ్చ్వాస నిశ్వాసలుగా ..

ఊపరి ఉన్నంతవరకు

ఉప్పెనలా ఉరికిన వాడు

జీవితాన్ని ముద్దాడి…ఊపిరి తీసుకున్నాడు

ఉద్యామానికి ఊపరిలూదాడు

ఇప్పుడు…

రోహిత్ అనే మూడు అక్షరాలు

చైతన్యానికి పర్యాయపదం

బహుజనులకు నిత్యనామస్మరణం

ఉద్యమానికి ఉత్ర్పేరకం . 

భవిష్యత్ కు ఆశాదీపం.

bamdaru sureshbabu(basu)
బండారు సురేష్ బాబు(బసు) గుంటూరు 9705444341

 

 

Share This Post

One Comment - Write a Comment

 1. దుర్గా రామ్ · Edit

  “మరణం మన చేతుల్లో ఉండదని
  ఆ భయంతోనే జీవితాంతం భయభయంగా ..
  పిరికివాళ్లల్లా బ్రతుకీడుస్తారు” అద్భుతమైన భావనతో కవిత రాసిన సురేష్ గారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.
  – దుర్గా రామ్

  Reply

Leave a Reply