రచయతలు ప్రజల గొంతుక అవ్వాలి  

    తెలంగాణ రచయితల వేదిక ఖమ్మం జిల్లా ప్రధమ మహసభలో వక్తల పిలుపు

తెలంగాణ రచయితల వేదిక ఖమ్మం జిల్లా మహాసభ ఆదివారం(27/3/2016)న ఖమ్మం లోని జిల్లా పరషత్ మీటింగ్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈమహసభకు జిల్లా నలుమూలల నుండి కవులు, రచయితలు,సాహిత్య అబిమానులు హాజరయ్యారు.జిల్లా తె.ర.వే అద్యక్షులు యన్.తిర్మల్ అద్యక్షతన మహాసభ ప్రారంభ సమావేశం జరిగింది. chandanasఈసభలో ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త చందన ఛక్రవర్తి ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు మతప్రచార కేంద్రాలు గా మార్చి పాలకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.విశ్వవిద్యాలయాలు కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. పాలకుల విధానాలు పసిగట్టి ప్రజల గొంతుకలుగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వాలపై  పొరాటం లో మీడియా,  సోషల్ మీడియా తమ భూమికను సమర్దవంతంగా నిర్వహించాయన్నారు.

సభకు ముఖ్యవక్తగా హాజరైన ఆచార్య హరిగీందర్సింగ్ మా ట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని విధంగా మతోన్మాద ధోరణి ప్రభలుతుందని ‘లౌకిక రాజ్యం లోఈ తరహా పోకడ సరికాదన్నారు.తె.ర.వే రాష్ట్ర అద్యక్షులు ఆచార్య జయధీర్ తిరుమల రావు jayadheerమాట్లాడుతూ సమాజంలో ప్రభలుతున్న ప్రమాదకర దోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తె.ర.వే.రాష్ట్ర కార్యదర్శి గాజోజు నాగభూషణం మాట్లాడుతూ రఛయితలు సామాజిక చైతన్య రచనలతో పాటు ప్రత్యక్షపోరాటాల్లో పాలు పంచుకోవాలని కోరారు.జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్ సందేశం ఇస్తూ రచయితలకు రాజకీయ  దృష్టి అవసరం అన్నారు.తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనర్ కే.ఆనందాచారి సందేశం ఇస్తూ రచయితలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉం దన్నారు.ప్రముఖ పాటల రచయిత శక్తి మాట్లాడుతూ తనకు జిల్లా వామపక్ష ఉద్యమాలతో ఉన్నసంబందాలు గుర్తు చేసుకున్నారు. ఇఃకా ఈసభలో డాక్టర్ యం.యఫ్. గోపీనాథ్ తదితరులు ప్రసంగించారు.                                

tirumalaraoఅనంతరం జిల్లా సాహిత్య సదస్సు లెనిన్ శ్రీ ని వాస్ అధ్యక్షతన జరిగింది. ఈసదస్సులో జిల్లా సాహిత్య చరిత్రను డా క్టర్ ఆంజనేయులు. గిరిజన సాహిత్యం పై అనసూయ, జీవన్ తదితరులు ప్రసంగించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో 30 మంది కవులు పాల్గొన్నారు. ముగింపు సభలో ఢాక్టర్.దిలావర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభలో జిల్లా ప్రముఖ కవుల ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి.

 

                                                       “జలశబ్దం” ఆవిష్కరణ

                         తె.ర.వే.సభలో ముంపు నిర్వాసిత కవితా సంకలనం “జలశబ్దం”ఆవిష్కరించారు. భాల కవుల“చిగురాకుల సవ్వడి”సంకలనాలు ఆవిష్కరించబడింది. ఖమ్మం లో దాశరథీ సోదరుల కాంశ్య విగ్రహం ఆవిష్క్టరింపచేయాలని, వందేళ్ళనాడే తెలంగాణ బాష. యాస కు ఆధ్యుడైన ఛందాల కేశవదాస్ చరిత్ర తెలంగాణ పాఠ్యాంశాలలో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయగా. ఆదివాసీలను నిర్వాసితుల్ని చేసే అబివృద్ది ని వ్యతిరేకిస్తూ తీర్మానం సభ ఆమోదించింది.అనంతరం తిర్మల్ అద్యక్షులు గా15మంది జిల్లా కార్యవర్గం మహాసభ ఎన్నుకుంది.

Share This Post

Leave a Reply