కోల్పోయిన బాల్యం – మార్టూరి శ్రీరామ్ ప్రసాద్

 

ఇరుగుపొరుగు వారితో

కొట్లాటలు వస్తాయని

నన్ను కన్నవారు

గంప క్రింద కోడిపిల్లలా పెంచారు.

నలుగురిలో కలవనీయకుండా

పుస్తకాల మధ్యే లోకం అన్నట్లు

పదిమందిలో మసలకుండా

ఆటల్లో నిలవకుండా పెంచారుchild

అందుకే

నేను చిన్నప్పటినుండి

పెద్దగా ఆటలాడలేదు.

ఉక్కుశరీరాన్ని

ఇనుప నరాల్ని సంపాదించలేదు.

పుస్తకాలలో ప్రపంచాన్ని చూసా,

ఇప్పుడు కళ్ళ ముందు చూస్తూ

కవిత్వం కడుతున్నాను

ఆటలు ఆడుతూ ఆనందాన్ని పొందుతున్నాను

ఇనుప నరాల్ని కాకపోయినా

ఉక్కు శరీరం లేకపోయినా
ఆరోగ్యంగా ఉన్నా

ఏదిఏమైనప్పటికీ

చిన్నప్పటినుండే

పదిమందిలో కలవాలి

సావాసగాళ్ళతో కోట్లాడాలి, ఆటలాడాలి

అన్నిటికి వేదిక బాల్యమే కావాలి

బాల్యంలో మంచి బీజం పడితే

విజ్ఞానం,వికాసం

ఆరోగ్యం,ఆనందం తో పాటు

సర్వం స్వీకారం అవుతాయి.

 

మార్టూరి శ్రీరామ్ ప్రసాద్ చరవాణి:9490455599
మార్టూరి శ్రీరామ్ ప్రసాద్
చరవాణి:9490455599

Share This Post

One Comment - Write a Comment

Leave a Reply