భారత మాతా కు జై …. షేక్ అల్లాబక్షు

అంతటా నరాలు తెగిపోయే ఉత్కంఠత. దాయాది దేశాలమద్య క్రికెట్ పోరు అంటే ఆసక్తి కనపరచటం సర్వసాదారణమే. ఇండియా పాక్ నిర్దేశించిన లక్ష్యానికిచేరుకోవటానికి 79 పరుగులు చేయాలి. కాని ఇండియా చేతిలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పట్టణంలో ఎటుచూసినా క్రికేట్ సందడి కనిపిస్తుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్రాణసంకటమే. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఒక వైపు మనవారి ఆటతీరుపై కామెంట్లు, విశ్లేషణలు, ఆటగాడు ఫొర్ కొడితే ఆనందం, ముందుకు కదలకుండా పాక్ ఆటగాళ్లు నివారిస్తే బండబూతులు.ఇది ప్రతి వీధిలోనూ కనిపిస్తున్న దృశ్యం. మరోవైపు ఆటగాళ్లు ఒక రన్ చెసినా భారత్ మాతకి జై అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.
××××××××××××××××××
425e8d1e2e0067ec8945b9df178925b3“నాన్న కొడుకులు ఇద్దరు పనులు మానివేసి క్రికేట్ చూస్తూ కూర్చొంటే పనులు ఎవరు చేస్తారంటా,, ఇంతవరకు బజారుకు వెళ్లలేదు. చికెన్ తేనూ లేదు” అంటూ టీవీకి అడ్డంగా నిలబడింది ఫరిదా.
“అమ్మి ప్లీజ్.టెన్షన్ పెట్టకు..అయిపోతుంది కదా అబ్బావెళ్తాడులే..”అంటూ సమర్ధించే ప్రయత్నం చేశాడు అమీర్.
కొడుకు మాటలకు కొడుకుమీద కన్నా భర్తమీదే కోపం పెరిగిపోయింది.
వాడిదా చదువుకొనే వయస్సు, ఈయన బుద్ది ఏమైనట్లు. షెడ్డుకు వెళ్లకుండా,ఇంట్లో పనులు చేయకుండా క్రికేట్ చూస్తూ కూర్చొవటానికి అనుకుంటూ అదే మాట బయటకు అనేసింది.
“షరం లేదా.. వాడి పుట్టిన రోజని చెప్పి పదిరోజులనుంచి నానా హడావిడి చేశావు కదా..తీరా ఈ రోజు వాడి పుట్టిన రోజు ఇంట్లో కూర్చొని లెగవ కుండా టీవీ చూస్తూ కూర్చొంటావా. అట్టే టైం లేదు,వాడి సావాసగాళ్లను భోజనానికి పిలిచాడు. సహాయం చేయటానికి ఇంటికి వస్తానన్న మీ చెల్లులు సాహిదా కూడా ఇంకా రాలేదు. ముందు అక్కడి నుంచి లేవండి ..” కసరుకుంది.
లేవక తప్పలేదు మస్తాన్ వలికి. లేచి అమెను సముదాయించకపోతే పరిస్థితి అదుపుతప్పుతుంది.
“సరేలే నేను మార్కెట్ కు వెళ్లి చికెన్ తెస్తాను. ఈలోగా కొంచెం ఖీర్ తెచ్చి పెట్టు …”. ఖీర్ తేవటానికి ఫరిదా వంటగదిలోకి వెళ్లగానే కొడుకు పక్కనే టీవీ చూడటానికి సెటిల్ అయ్యాడు. ..ఆట చివరికి వచ్చింది.ఆమె ఖీర్ తెచ్చేలోగా ఆటకూడా అయ్యిపోతుంది అనుకుంటూ…
××××××××××××××××
మస్తాన్ వలి పెద్దగా చదువుకోలేదు. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకుంటున్న సమయంలోనే మనకు చదువు ఎందుకు అంటూ వాళ్ల నాన్న మెకానిక్ షెడ్డులోకి పంపాడు. పనిపట్ల అసక్తి కనపర్చటంతో కొంతకాలంలోనే వాళ్ల మేస్త్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. కుర్రాళ్ల అందరి కంటే వలిపైనే ఆసక్తి చూపి మరింత పనిని నేర్పించాడు. కారులో ఏ ట్రబుల్ ఉందో సౌండ్ చూసే చెప్పే స్థాయికి చేరుకున్నాడు. దీంతో కొంతకాలానికే పనినేర్పిన మేస్త్రికి అల్లుడయ్యాడు. పట్టణంలో వలి షెడ్డు అంటే తెలియని వారు ఉండరు. ప్రాక్టికల్ జీవితానికి విలువ ఇచ్చే తాను అమీర్ పుట్టగానే ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాడు. బంధువులు ఎవరు ఎన్ని విధాలచెప్పిచూసినా వినకుండా తానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. చిన్నతనం నుంచి ఇంజనీర్లు అంటే ఉన్న ఆసక్తిని తన కొడుకు ద్వారా తీర్చుకున్నాడు. ఆటో మొబైల్ ఇంజనీర్లో చేర్పించాడు. అప్పుడుప్పుడు తన షెడ్ దగ్గరకు తీసుకువెళ్లి అక్కడి వాళ్లకు తన కొడుకు గురించి గర్వంగా చెప్పేవాడు. వారి ప్రశంసలు విని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ లోలోపలే ఆనంద పడే వాడు. ఇల్లు, మసీదు తప్పా ఇతర ఏ దుర అలవాట్లు లేని వలికి క్రికెట్ అంటే పిచ్చి ఎవరి ఆట తీరు ఏమిటో..ఏ పిచ్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయో చెబుతుంటే షెడ్డు చుట్టుపక్కలా వాళ్లతో పాటు కారు రిపేరుకు వచ్చిన వాళ్లు సైతం ఆసక్తిగా వినేవాళ్లు .ఇండియా గెలిచిందా ఆ రోజు షెడ్డులో ఉన్న కుర్రాల్లకు విందుభోజనమే. ఆసక్తి ఉన్నా లేకున్నా బిర్యాని కోసం కుర్రాళ్ళు మాత్రం ఇండియా గెలవాలనే కోరుకునేవారు.
××××××××××××××××××××××××××××××××
18 బంతుల తేడాతో ఇండియా ఓడిపోయింది. పరిధా ఇచ్చిన ఖీర్ చేదుగా అనిపించింది వలికి. ఎట్టి పరిస్థితిలోనూ గెలవాల్సిన మ్యాచ్. అయిపోయింది. ఇంకా ఇండియా ఇంటికి రావటమే. కొంతసేపు బాధపడ్డాడు.
భర్త మొహంలో భావాలను పసిగట్టింది.
“మీ క్రికెట్ పిచ్చి మీరునూ, వాడి పుట్టిన రోజన్న విషయం అన్నా గుర్తుందా … “అంటూ మందలించటంతో ఈ లోకంలోకి వచ్చాడు.
“సరే నేను నమాజుకు వెళ్లి అటునుంచి మార్కెట్కు వెళ్లి వస్తా. అమీర్ మీ ప్రెండ్స్ కు ఫోన్ చేయి.భోజనానికి రమ్మని గుర్తుచెయ్యి.” అంటూ బైక్ తాళం తీసుకొని బయటకు వచ్చాడు. మ్యాచ్ హైలెట్స్ చూస్తున్న అమీర్ నుంచి రిమెట్ లాక్కోని టీవీ ఆఫ్ చేసింది పరిధా
“మీ నాన్నతో నీవు తయారయ్యావు. ఇవాళ్ల నీ పుట్టిన రోజన్న విషయం మరిచిపోయావా. పది రోజుల నుంచి సతాయించి వేలకు వేలు పోసి ఫోన్ కొన్నావు. లే లేచి రెడీ అవ్వు. స్వీట్లు, ఖీర్ తీసుకువెళ్లి హనుమంతరావు అంకుల్, సత్యంకు ఇచ్చి వాళ్లను భోజనానికి రమ్మని చెప్పు..అలాగే మీ షహిదా ఆంటీని వెంటేనే ఇంటికి రమ్మను”.
క్రికేట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయిందన్న బాధ ఒక వైపు తొలచివేస్తున్నా.పుట్టిన రోజు… ప్రెండ్స్ అంతా ఎదురుచూస్తుంటారని స్వీట్ బ్యాక్సు తీసుకొని బయటకు నడిచాడు అమీర్
ΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧΧ
క్రికెట్ ఇండియా ఓడిపోయిందన్న బాధతో పట్టణంలో కొంతమంది అభిమానులు క్రికేటర్ల దిష్టిభమ్మలు తగలబెడుతున్నారు. ఏదో పోగొట్టుకున్న బాధ ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. అమీర్ శివాలయం వీధి దాటాడు. రెండు అడుగులు వేస్తే పక్కనే తన తండ్రి స్నేహితుడు హనుమంతరావు ఇల్లు.
“ఏరా అమీర్ ఉదయం నుంచి కనిపించలేదు..”అంటూ చనువుగా భుజం మీద చేయి వేశాడు తన మిత్రుడు వెంకటేష్.
అతను డిగ్రీ మద్యలో అపివేసి ఏవో సంఘాలని, గోమాంసంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటాడు. రోజు కాలేజి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో శివాలయం ఎదురుగా ఉన్న టీకొట్టు వద్ద కనిపిస్తుంటాడు. అప్పుడప్పుడు ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని, గొడ్డుమాంసం తినటం నేరమని వాదిస్తుంటాడు. అతని మాటలు వినకపోయినా తప్పనిసరిగా చిన్ననాటి మిత్రుడు కాబట్టి వినినట్లే నటిస్తుంటాడు అమీర్. ఎప్పుడు కూడా వాదనకు దిగలేదు.
తన ఇంటికి భోజనానికి పిలిచే లిస్టులో వెంకటేష్ పేరులేదు. పిలిస్తే అమ్మి తిడుతుంది. పోయిన రంజాన్ కు అమ్మీకి తెలియకుండా ఇద్దరు స్నేహితులను పిలిచినందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.. ఆలోచిస్తున్నాడు అమీర్.
ఏరా పిలుస్తుంటే పలకవేంటి. చేతిలో స్వీట్ బాక్స్ చూసాడు. అంతే ఉగ్రనరసింహుడయ్యాడు. పాకిస్తాన్ గెలిచిందని స్వీట్లు పంచుతావా..అమీర్ కు ఇక్కడ మాట్లాడే అవకాశమే లేదు. బిగ్గరగా కేకలు వేస్తూ అమీర్ చేతిలోని స్వీటు బ్యాక్స్ లాక్కొని అక్కడ ఉన్న వారికి చూపుతూ వీధిలో రాద్దాంతం చేశాడు. అప్పటికి అమీర్ కు ఏం జరుగుతుందో తెలిసింది. చేతిని విదిలించుకొని బయట పడటానికి ప్రయత్నించాడు. చేతిలోని స్వీట్లు కిందపడ్డాయి. ఈ లొగా చుట్టూ జనం నిండిపోయారు. ఇదే వారికి కావల్సింది. తలో మాట అనటం ప్రారంభించారు. ఇందులో అత్యధికమంది వెంకటేష్ తాలుకు మిత్రబృంధమే ఉంది. అక్కడవారు ఓడిన ఇండియా క్రికేటర్ల దిష్టిబొమ్మలు తగలబెట్టదానికి సరంజామను తయారు చేస్తున్నారు.
ఇలాంటి వాళ్ల ను పాకిస్తాన్కు తరమివేయాలి. ఇండియా ఓడిపోతే పండుగ చేసుకుంటారా..మా గోమాతను కోసుకు తింటారా..అంటూ ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు.
బిక్కచచ్చిపోయాడు అమీర్. నా పుట్టిన రోజని స్వీట్లు పంచుతున్నా..చేతులు జోడించి వేడుకున్నాడు.
“ఇదో కొత్త డ్రామానా, అరే భారతమాతకు జై అనరా ! ఎవరో సూచించాడు. వీడితో మాటలేంటి.వెనుక నుంచి ఎవరిదో బలమైన చెయ్యి అమీర్ శరీరాన్ని తాకింది. కళ్లు బైర్లు కమ్మాయి. కిందపడిపోయాడు. పుట్టినరోజున వేసుకొన్నకొత్త బట్టలు మట్టికొట్టుపోయాయి. దేశభక్తులకు ఆవేశం పెరిగింది. కిందపడినవాడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.అమీర్ కు చివరగా నాన్న అమ్మి జాన్ కళ్లలో మెదిలారు.
మరుసటి రోజు వీధిపోరాటాలకు యువకుని బలి. …అంటూ పతాక శీర్షికతో వార్తలు వెలిసాయి.
××××××××××××××××××××××××××××

sk.allabakshu
 

షేక్ అల్లాబక్షు జర్నలిస్టు 16.438, చిలకలూరిపేట.522616 గుంటూరు జిల్లా సెల్ ..9290592576

 

 

 

 

 

 

 

 

Share This Post

4 Comments - Write a Comment

  1. syed sabir hussain · Edit

    allabaksh gariki abhinandanalu.deshamlo prasthuta paristhithulanu kallaku kattinatlu rasaru.deshabhakthi ni kondaru patent ga feel avuthunnaru. aata paatalaku parimitham chesi deshabhakthi pera deshamlo vidveshalanu srustistunnaru.kevalam rajakeeya konamlo deshabhakthi ni angadi sarugga marchesaru. pratyekamga muslimlanu deshadroholuga mudralu vesi rakshasanandam pondutunnaru. donga deshabhakthula guttu rattu chesaru allabaksh.hindu muslim andaru kalsi melsi donga deshabhakthulaku gunapatam cheppali.

    Reply
  2. నా కధ చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపిన సాహితీ మిత్రులు, పెద్దలకు, నా కధ వెలుగు లోకి తెచ్చిన గమనం సంపాదకులకు నా కృతజ్ఞలు .. మీ అల్లాబక్షు

    Reply

Leave a Reply