తొలకరి చినుకు తొంగిచూసింది – పంజాల ఐలయ్య

తొలకరి చినుకు నింగినుంచి తొంగిచూసింది
నీటి తుంపర్లుగా జాలువారింది
పుడమితల్లి పులకరించింది
మట్టివాసనలు వెదజల్లాయి
మృగశిరకార్తెతో వాతవరణం మెత్తపడింది
ఆకాశన మబ్బు తెమ్మరలు   
il_570xN.424246594_5asdచల్లగాలితో ఊసులాడి
ఉరుముల మెరుపులతో రణం చేసి
చిటపట చినుకులను కురుపించాయి
ఎండచూపుతో నెర్రలు బారిన నేలమ్మ
తనివి తీర తడిసి  పోయింది
ఉప్పొంగిన మనస్సుతో
ఉరకలేసే నీటి పరుగుల నురగలు
పల్లం వైపుకు పయనమయ్యాయి
ముత్యాల చినుకుల జలధారలు
భూతల్లి ఒడిలో ఇంకిపోయి
దప్పిక తీర్చింది
పచ్చ చీర తొడిగిన ప్రకృతిలో
పైరుపంటలకు జీవం పోసింది
ప్రాణకోటికి ఆకలి తీర్చి ఆనందం పంచింది

పంజాల ఐలయ్య 9440324881
పంజాల ఐలయ్య
9440324881

Share This Post

Leave a Reply