Category: ఈవెంట్

ఉగాది కవితల పోటీ

‘విశాఖ జిల్లా కవికోకిలలకు ఆహ్వానం… “సృజన… విశాఖ” భావావిష్కరణ వేదిక & “గరిమ” సాహిత్య సంస్థ సంయుక్త నిర్వహణలో ఉగాది కవితల పోటీ. ప్రథమ,ద్వితీయ,తృతీయ,మూడు ప్రోత్సాహక బహుమతుల విజేతలకు ఙాపికలతో సత్కారం. ఉగాది సందర్భంగా ఇరవై అయిదుగురితో కవిసమ్మేళనం. నవ కవులకు స్వాగతం. ఉగాది ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఆశావహదృక్పథంతో అక్షరీకరించిన ముప్ఫయి వాక్యాలకు మించని కవితలు పంపాల్సిన చిరునామా: జోగారావు గుండాన, 6-253/6, శ్రీ సాయినగర్ కాలనీ, సింహాచలం పోస్టు, విశాఖపట్నం-530028 ,మొబైల్:9490185708,ఆఖరు తేది:20.03.16.

కవిత్వానికి ఆహ్వానం

మార్చి నెలలో జరగనున్న తెలంగాణా రచయితల వేదిక, ఖమ్మం జిల్లా మహాసభ నాటికి పోలవరం ముంపు బాధితుల అక్రంధనలపై ఓ కవితాసంకలనం తీసుకు రావాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. నిన్నటిదాకా తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న ప్రజలు రాత్రికి రాత్రి అర్డినెన్స్ తో ఆంద్రప్రదేశ్ లోనికి వెళ్ళిపోయారు. ఇది ఏడు మండలాల ముంపు గిరిజన ప్రజలు జీర్ణించుకోలేనిది. పోలవరం ప్రాజెక్టు క్రింద నిర్వాసితులౌతున్న ప్రజల హృదయఘోషను అక్షర బద్దం చేసి “పోలవరం” పొలికేకను ప్రపంచానికి వినిపిద్దాం. రాష్ట్రం…