Category: ఫోటో కవిత

ఫోటో కవిత – 2

  “కన్నతీపి” గుక్కతిప్పని రెక్కల సమ్మెట పేగుబంధం వీపు ఊయల మోపున కన్నతీపి “తొమ్మిదో నెల” కాలరేఖను దిగమింగింది వొడిదుడుగు బతుకు పోరును ఎగజిమ్మింది…                                                          – డా. ఎం.ఎన్.బ్రహ్మానందయ్య,              …

ఫోటో కవిత – 2

ఈక్రింది ఫోటో చూశారుగా … దీనిపై మీరు క్యాప్సన్  లేదా , కవితగానీ రాసి, శీర్షిక పెట్టి editor@gamanam.in కు పంపండి . దయచేసి మీరు రాసి facebook లో పెట్టవద్దు. గమనం mail కు మాత్రమే పంపగలరు.  

ఫోటో కవిత

పుస్తకాల సంచీ బరువు మోస్తూ నీవు.. బతుకు బరువై మోయలేక నేను..! కోటి కాంతుల భవిష్యత్తుకై నీవు.. కూటికి గతిలేక కష్టపడుతూ నేను..!! అనుక్షణం ముళ్ళదారిలో నేను.. తల్లితండ్రులు పరిచిన పూలదారిలో నీవు..!! ఓ ముద్ద తినమ్మా అంటుంటే వద్దని మారాంచేస్తూ నీవు.. ఓముద్ద తిందామంటే తమ్ముడికేం పెట్టాలన్న ఆలోచనలో నేను..!! ఏది ఏమైనా ధైర్యంగా బ్రతుకుతూ నేను.. పరీక్షల్లో తప్పితేనే బతకలేనంటున్నది నీవు..!!  –  దీప్తి స్పందన్ , ముంబాయి,9000123365.          …