Category: వ్యాసాలు

ఆదిమ కాలంలో ఒంటరి జీవితాన్ని ప్రారంభించిన ప్రాక్తన మానవుడు క్రమక్రమంగా సమిష్టి జీవితానికి అలవాటుపడ్డాడు.  పరిసరాల ప్రభావంతో నాగరికతను నేర్చుకున్నాడు.  సంస్కృతిని అలవర్చుకున్నాడు.  తోటి మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.  సంస్కృతి, సంబంధాలు కల్గిన మానవ సమాహారమే సమాజం.  కొన్ని కొన్ని సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, జీవన విధానం, విశ్వాసాలు, కళలు మొదలైన సాంస్కృతికాంశాలు మానవాళిలో కొందరికి సమానంగా ఉంటాయి.  అలాంటి సామాన్య సంబంధమున్న జన సమూహాన్నే సమాజమని వ్యవహరిస్తారు.  సమాజ సభ్యుల్లో ప్రతిఒక్కడికీ, తాను ఫలానా సమాజానికి చెందినవాడిననే…

అబ్జర్వేషన్ డోంలో గురజాడ కథలు – పరిశీలన – డా. ఎం. ఎన్. బ్రహ్మానందయ్య

గురజాడ శిల్పాన్నీ గురజాడ సాహిత్య దృక్పథాన్నీ సమగ్రంగా అంచనా కట్టడం కష్టం. లోతైన సంఘాచార సమాచారం ఆధునికంగా దొరకపుచ్చుకోకుండా కాదు కూడదూ పట్టుకోవాలని గొడ్డులా పరిశీలిస్తే అతడు కట్టుబడడు. అతని దృక్పథం అంతుచిక్కదు. కనుకనే, నవ్యసంఘబద్దులకూ సంస్కార బుద్ధులకూ యుగకర్తగా; పాతపడికట్టు కోవిధులయ్యలకూ కూవిధులయ్యలకూ ‘అకవి’గా ‘అరచయిత’గా నేటికీ? కనిపిస్తూంటాడు గురజాడ. గురజాడ సాక్షాత్తు ఒక్కరే అయినా ‘యథాబుద్ధి తథాదృష్టి’ తో ఇద్దరిగా కనిపిస్తుంటాడు. “పొలం దున్నే రైతు”, భక్తి పేరుతో దోపిడీచేసి చలువరాతి కట్టడంలో మసిలేవానికి…

సాహిత్యాన్ని బహుజన బాట పట్టిచ్చిన సామజిక కథోద్యమ నిర్మాణ రూప శిల్పి బి . ఎస్ . రాములు

                                                        -ఎలగొండ రాములు                 (  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన సాహితీ పురస్కారాన్నిప్రముఖ రచయిత శ్రీ బి.ఎస్.రాములు గారికి…

    మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠకుల అభిరుచులు కూడా మారుతూ వుంటాయి.  ఒకప్పుడు బాగా ప్రచారంలో సాహితీ ప్రక్రియలు ఇప్పుడు లేవు.  గతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనేవారు.  ఈ నాటి సాహితీ ప్రక్రియల్ని పరిశీలస్తే వాటిల్లో ఉన్నత స్థానాన్ని పొందిన కథాప్రక్రియను ‘కావ్యేషు కథా రమ్యం’ అని అనక తప్పదు.  పాశ్చాత్య రచయితల ప్రభావంతో వచ్చిన అనేక ప్రక్రియల్లాగే తెలుగులో ‘కథానిక’ కూడా ఒకటి.  అది అంచెలంచెలుగా ఎదిగి ఈయుగాన్ని కథానికాయుగంగా పిలిచే స్థాయికి…

బి.ఎస్.రాములు “బతుకు నేర్పిన పాఠం”… చీకటి పార్శ్వం పై ఓ వెలుగు!     -భూక్యా గోపీనాయక్

                              ఆధునిక తెలుగు కథారచయితలలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగివుండి ఒక సామాజిక నిబద్ధతతో తెలంగాణా పల్లె జీవితాన్ని, అణగారిన వర్గాల జీవిత నేపథ్యాన్ని, దళిత ,గిరిజన , బహుజనుల చైతన్యాన్ని వాస్తవిక దృష్టితో తన కథల్లో చిత్రించిన రచయిత బి.ఎస్.రాములు . సంఘటన, పాత్ర , మనస్తత్వ చిత్రణగా పాత కథలు నడిచాయి. వాటితోపాటు సామాజిక…

Civilized Dalit Life in the “Chicago Lo Nannamma” Short Stories of B.S.Ramulu – Dr. K.Rajani

Dalit literature, or literature about the Dalits, an oppressed Indian caste under the Indian caste system, forms a prominent part of Indian literature. Dalit literature emerged in the 1960’s, starting with the Marathi language, and soon appeared in Hindi, Kannada, Telugu and Tamil languages, through narratives such as poems, short stories, and, most , autobiographies,…

అంబేద్కర్ వాదం – భారతీయుల ఆశావాదం   – కళ్యాణచక్రవర్తి గొండ్యాల

“అవమానించటం అలవాటైన వాడికి ఆత్మాభిమానం అనే నినాదం ఎన్నటికి అర్థం కాదు “                                                                                           …

జగ్ నే కీ రాత్ మే-‘సమఝ్ నే కీ బాత్’ – డా. ఎం. ఎన్. బ్రహ్మానందయ్య

  కలియుగం, ఓ “జగ్ నే కీ రాత్”. యుగాధిపత్యాలు అజ్ఞాన మత మౌడ్యాల్నీ, బడుగు జీవుల దోపిడీల్నీ, కుటుంబ సంకెళ్ళ ఉచ్చుల్నీ ముఖ్యంగా; స్త్రీల లైంగిక దోపిడీల్నీ, పాతివ్రత్య స్వేచ్ఛాహరణాల్నీ, పర్దాల్నీ, బుర్ఖాల్నీ, సెహరాల్నీ తొలుచుకుంటూ, వివక్షతను చీల్చుకుంటూ సర్వజన హృదయ ఉదయానికై ప్రతి ఒక్కరూ నిద్ర లేవాలి. నిద్ర పోవడానికి వివరణలు అనవసరం. నిద్ర లేవకపోడానికీ గమ్యం తెలిసుండాలి. గమ్యం ఎన్నిక చేయడానికీ, ఆడా–మగ భేదం లేని, తరాల గుణపాఠం సామాజికం గానో, సాహిత్యపరం…

“శిలకోల” – గిరిజన జీవితాల సజీవ శిల్పాల కోట –	కొర్లాం సాయివెంకటేష్

               కథా రచన ఒక కళాత్మక తెలుగు ప్రక్రియ. పాఠకులకు తెలియని ఓ కొత్త లోకాన్ని, అంశాన్ని మరింత ఆసక్తికరంగా, సునిశితంగా కొన్ని భావావేశాల ప్రదర్శనలో ప్రకటించే ప్రయత్నం కథారచయిత చేస్తాడు. అది పాఠకులను ఏక బిగిన కథంతా చదివి విషయ సంగ్రహణ చేసుకోవాలనే ఉత్కంఠ వైపు నడిపిస్తింది.”శిలకోల” కథాసంపుటి కథాపుష్పాల కదంబం.ఈ కథల్లో గిరిజనుల స్థితిగతులతో పాటూ, అక్కడి వాతావరణ చిత్రణ, వారి సంప్రదాయ సొగసులు, ప్రకృతిని…