Category: కవితలు

తొలకరి చినుకు తొంగిచూసింది – పంజాల ఐలయ్య

తొలకరి చినుకు నింగినుంచి తొంగిచూసింది నీటి తుంపర్లుగా జాలువారింది పుడమితల్లి పులకరించింది మట్టివాసనలు వెదజల్లాయి మృగశిరకార్తెతో వాతవరణం మెత్తపడింది ఆకాశన మబ్బు తెమ్మరలు    చల్లగాలితో ఊసులాడి ఉరుముల మెరుపులతో రణం చేసి చిటపట చినుకులను కురుపించాయి ఎండచూపుతో నెర్రలు బారిన నేలమ్మ తనివి తీర తడిసి  పోయింది ఉప్పొంగిన మనస్సుతో ఉరకలేసే నీటి పరుగుల నురగలు పల్లం వైపుకు పయనమయ్యాయి ముత్యాల చినుకుల జలధారలు భూతల్లి ఒడిలో ఇంకిపోయి దప్పిక తీర్చింది పచ్చ చీర తొడిగిన…

“రారా మాఇంటి దాక” రామా –  నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి

“జానక్యా కమలాంజలి పుటే: యా పద్మరాగాయిత-న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయతే శ్రస్త శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నీలాయిత-ముక్తస్థ శుభద భవంతు భవతం శ్రీ రామ వైవాహికం” స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి,శుక్రవారం పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న , *************************************** అసమాన శివ ధనుర్భంగము గావించిన వానికి అగ్ని పునీత వేదవతి,అయోనిజ సీతను ఇచ్చి విదేహ మహారాజు చేయుచున్న ముదావహ “కన్యాదానము”లో…

ఉగాది శుభాకాంక్షలు – నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి

అహమును దరి రానీయని,సంవత్సర సహనపు సామూహిక  సంస్కారమా , నమస్కారమమ్మా. ……………. 1.శిశిరమును చూసి అసలు చింతించ వద్దని   నిశితముగ చూస్తే వసంతము అనుసరిస్తున్నదని   మోడైన రూపమే నీడనీయ గలదనుటకు   సాక్ష్యము తానన్నది చిగురిస్తున్న మామిడి. (సహనము)  ………………….. 2.ఎప్పుడంటే అప్పుడు గళము విప్పవద్దని   గానము చేయాలనుకున్నా మౌనము తప్పవద్దని   మావి చిగురు తినువరకు మారాడకుండుటకు   సాక్ష్యము తానన్నది సంగీతముతో కోయిల.(నియమము)  ………………. 3.ఎద నిండిన అనురాగము ఎల్లలే…

కోల్పోయిన బాల్యం – మార్టూరి శ్రీరామ్ ప్రసాద్

  ఇరుగుపొరుగు వారితో కొట్లాటలు వస్తాయని నన్ను కన్నవారు గంప క్రింద కోడిపిల్లలా పెంచారు. నలుగురిలో కలవనీయకుండా పుస్తకాల మధ్యే లోకం అన్నట్లు పదిమందిలో మసలకుండా ఆటల్లో నిలవకుండా పెంచారు అందుకే నేను చిన్నప్పటినుండి పెద్దగా ఆటలాడలేదు. ఉక్కుశరీరాన్ని ఇనుప నరాల్ని సంపాదించలేదు. పుస్తకాలలో ప్రపంచాన్ని చూసా, ఇప్పుడు కళ్ళ ముందు చూస్తూ కవిత్వం కడుతున్నాను ఆటలు ఆడుతూ ఆనందాన్ని పొందుతున్నాను ఇనుప నరాల్ని కాకపోయినా ఉక్కు శరీరం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నా ఏదిఏమైనప్పటికీ చిన్నప్పటినుండే పదిమందిలో…

ఆయన మరణం ఒక విప్లవం     – బండారు సురేష్ బాబు(బసు)

ఆయన జననం ఒక ప్రమాదమైతే ఆయన మరణం ఒక విప్లవం అవును… తన జననాన్ని ప్రమాదంగా సిద్దాంతీకరించిన వాడు తన మరణాన్ని విప్లవీకరించాడు  జననం ఆయన చేతుల్లో లేదు కాబట్టి మరణాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు  అందరు అంటుంటారు. .. మరణం మన చేతుల్లో ఉండదని ఆ భయంతోనే జీవితాంతం భయభయంగా .. పిరికివాళ్లల్లా బ్రతుకీడుస్తారు బాల్యం నుంచి బ్రతుకే పోరాటమై బ్రతుకుతున్న ఏకలవ్యశిష్యుడికి భయానికి అర్ధం తెలియదు అధ్యయనం..పోరాటమే..  ఉచ్చ్వాస నిశ్వాసలుగా .. ఊపరి ఉన్నంతవరకు…

గమ్యం   – M.R.D. రామ్

కంటి నీడలుజీవితాలు కనుపాపలు గమ్యాలు గమ్యాన్నిచేరాలంటే కనుపాపల గీతలు మన తలరాతలు బావుండాలి అలా అని అనుకుంటే సరిపోదు వాటి రాతను మనం మార్చగలగాలి చేతి రాతను తిరగరాయాలి అలా చేస్తే మీ జీవితాలకు చెరువు గట్టులా పంట చేనులా తిరుణాల సందడిలా కను పాపలకు నేస్తంలా మారుతుంది జీవితం మరి ….. ఆ మార్పు ఓర్పు నీలోన దాగి ఉన్న విషయం తెలుసుకున్నవా? ఐతే రా… రా…  నాతో చేయీ కలుపు నీ విజయ గీతను…

నానోలు   –  అనంతోజు మోహన్ కృష్ణ

1.   డాలర్       క్రేజు      లగ్జరీ      మోజు 2.  ఆశ      నిచ్చెన      పేరాశ     పాము 3.  కార్పోరేట్     బడులు     ఒత్తిళ్లు    లోగిళ్లు 4.  చుక్కలు     చంద్రుడు    శ్రామికులు     రైతు 5.  పబ్ లో     కాలు    ఫ్లగ్ లో    వేలు…

అష్టావకృలు  – యన్.తిర్మల్

       (అంతర్జాతీయ మహిళాదినోత్సవం దినోత్సవం సందర్భంగా) సారీ…సారీ…సోరీ.. సోనీ……….!?  అన్న ధాత అనసూయమ్మనూ                                    దిశమొలతో కూడు పెట్టమన్నమూడుమూర్తుల గడ్డ    నిస్సాహయ మహిళ ల అంగ వస్త్రాలు తో పొన్న చెట్లు ఎక్కిన పోకిరి దేవుళ్ళ అడ్డా   సీతమ్మ తల్లి నిసైతం           …

ఎగిరే గువ్వలం – పంజాల ఐలయ్య

ఆకాశంలో విహరించే రివ్వున ఎగిరే గువ్వలం జతకలసిన మనస్సు పెనవేసిన అనురాగం జన్మజన్మల బంధం చెదిరిపోని కలగా కలసియుందాం కలకాలం చేసిన బాసలు చెప్పిన ఊసులు కనుమరుగై కసి పెంచుకుని ఎడబాటుతో చితికిన మమతల పూదోట వడిలిపోయింది ఒంటరితనం వణుకు పుట్టించింది విధిరాత ను తిట్టుకుంటు నీరీక్షించిన క్షణం మనస్సులో కలవరం మొదలై ప్రశ్నించింది మారుమనస్సుతో గూడు తలుపు తట్టి మనస్సు ను పలకరించింది చిగురించిన ఆశలతో రెక్కలు విప్పి ఆనందంతో గగనతలంలో కలసి విహరిస్తాం

జైజై తెలంగాణా – నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి

 స్వాతంత్రం వచ్చింది చక్కని భారత దేశానికి  ఐనా పరతంత్రమే, నైజాంకి చిక్కిన “తెలంగాణా”కి  తల్లిదైన్య కారణము,ఖాసిం రజ్వీ సైన్యము  అరాచరికపు రూపమైన “రజాకార్ల” వైనము  తెలంగాణా జిల్లాలను తొక్కేసిన ఫలితమేగ  “నీ బాంచెన్ దొర” అనే చితికిన బతుకులు  “దళితులు” అని వెలివేసిన మూగవైన గళములు  వేదనే మిగిలిన “ఆదివాస”జనములు  దిక్కులు దద్దరిల్లేలా “పెద్దరికపు” గుర్రులు  బిక్కుబిక్కుమనేలా  “పేదరికపు”గురుతులు  దేవుళ్ళాడినగాని సోదినైన గానరాదు  పరేషాను!పరేషాను! ఏడుందిరా మన “షాను”? (శ్రీ జమలాపురము కేశవరావు)  పొద్దుపొడుపు సూరీడల్లే చెడ్దతనమును…