Category: కథ

ఏది నిజం ? –  జీడిగుంట నరసింహ మూర్తి

సాయంత్రాలు టెర్రస్ పైన కూర్చుని వేడి వేడి కాఫీ సేవిస్తూ ఈ సమాజంలో రకరకాల మనస్తత్వం గల వాళ్ళ గురించి పత్రికలలోని సాహిత్యం గురించి, భ్రష్టు పడుతూన్న రాజకీయాల గురించి  ఇంకా ఇప్పుడొస్తున్న సినిమాల గురించి సుదీర్ఘంగా రచయిత  శ్రీకాంత్ , నేను ముచ్చటించుకోవడం దాదాపు రోజూ జరిగేదే. అప్పుడప్పుడు మా సంభాషణలలో మా ఆవిడా కూడా తల దూర్చేది . మా మధ్య అనేకానేక విషయాలు చర్చకు వొస్తూ ఉంటాయి. ఆ రోజు శ్రీకాంత్  కుటుంబ…

భారత మాతా కు జై …. షేక్ అల్లాబక్షు

అంతటా నరాలు తెగిపోయే ఉత్కంఠత. దాయాది దేశాలమద్య క్రికెట్ పోరు అంటే ఆసక్తి కనపరచటం సర్వసాదారణమే. ఇండియా పాక్ నిర్దేశించిన లక్ష్యానికిచేరుకోవటానికి 79 పరుగులు చేయాలి. కాని ఇండియా చేతిలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పట్టణంలో ఎటుచూసినా క్రికేట్ సందడి కనిపిస్తుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్రాణసంకటమే. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఒక వైపు మనవారి ఆటతీరుపై కామెంట్లు, విశ్లేషణలు, ఆటగాడు ఫొర్ కొడితే ఆనందం, ముందుకు కదలకుండా పాక్…

పురస్కారం     –     జీడిగుంట నరసింహ మూర్తి

సదానందంకు ఏ పని చెయ్య బుద్ది కావడం లేదు.ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచు కొచ్చాయి. తను తన వృత్తి ధర్మంలో ఒక రకంగా ఘోరంగా అవమానింప బడ్డాడు. డబ్బయితే సంపాదించుకో గలిగాడు గాని అది తీరని అశాంతి మిగిల్చింది.. ప్రస్తుతం అనుక్షణం అతను తీవ్రమైన భావోద్రేకానికి ఎందుకు గురవుతున్నాడో ఒకసారి అతని గతంలోకి తొంగి చూస్తే కాని తెలుసుకోవడం కష్టం. “ఈ పని మీ వల్ల కాదుకాని సదానందాన్ని పిలిపించండి. ఆ విషయం…

మార్పు   – షేక్ అల్లాబక్షు

హాచ్…హాచ్ . పక్కల్లో ఆటంబాబు పడ్డట్లు ఉల్లిక్కి పడ్డాడు అనుమానాలరావు కాదు.ఆనందరావు . ముఖానికి ఉ న్న మాస్కుని సరిచేసుకొని కోపంగా ఎదురుగా ఉన్న మనిషిపై విరుచు కు పడాలని నోరు తెరవబోయాడు. ఉగ్రనరసింహంలా ఉన్న తన బాస్ గురుమూర్తిని చూసి ఉలిక్కి పడ్డాడు. ఎం క్లాసు పీకుతాడో..అనుకుంటునే కూర్చిలో నుంచి లేచి నిలబడ్డాడు. ఏవయ్యా మా పాప పట్టినరోజుకు స్వీట్లు తెచ్చి ఇవ్వబోతే అక్కడి పెట్టి వెళ్లమన్నావంటా. చేత్తో తీసుకోకపోతే సరి. వాటిని తినకుండా చెత్త…